News September 24, 2024
పాము కాటుతో వ్యక్తి మృతి.. గ్రామస్థులు ఆ పామును ఏం చేశారంటే

ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాకు చెందిన దిగేశ్వర్(22) అనే వ్యక్తిని కట్లపాము కాటేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. ఆ పామును పట్టుకున్న స్థానికులు మృతుడి చితిపై దాన్ని బతికుండానే తగులబెట్టారు. ఇంకెవరిని చంపుతుందోనన్న భయంతోనే ఇలా చేశామని తెలిపారు. దీనిపై అధికారులు విచారం వ్యక్తం చేశారు. పాముల గురించి, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 29, 2025
పార్వతీపురం: గిరిజన పీజీఆర్ఎస్కి 26 వినతులు

గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 వినతులు అందినట్లు జాయింట్ కలెక్టర్, ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడిఏ గిరిమిత్ర హాలులో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీవో సమక్షంలో జరిగింది. గిరిజనుల వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సంబంధిత సమస్యలను నేరుగా సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో ఉంచి పరిష్కారం పొందేలా చూడాలన్నారు.

TODAY HEADLINES

➢ గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(77 ఫీట్) రాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
➢ జనవరి 1న అందరం లొంగిపోతాం: మావోయిస్టు పార్టీ
➢ 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: CM CBN
➢ అమరావతిలో 15 బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన
➢ దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
➢ TGలో పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
➢ కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీళ్లు రాలేదు: కవిత