News August 11, 2024
మూగజీవాల ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్ భూతం

AP: పట్టణాల్లో పశువులకు మేత దొరక్కపోవడంతో వాడిపారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు తిని అవి ప్రాణాలు వదులుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిన పదార్థాలు తిని ఆవు, కడుపులోని దూడ మరణించాయి. పశువైద్యులు ఇంజక్షన్ ఇచ్చి సెలైన్ ఎక్కించినా ఫలితం లేకపోయింది. చాలా పట్టణాల్లో ఇలా రోడ్లపై వదిలేయడం వల్ల రాత్రిపూట యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి.
Similar News
News October 30, 2025
సరైన నిద్రలేకపోతే అందానికి దెబ్బ

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేమి వేధిస్తోంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే నిద్రలేమితో అందం కూడా దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. సరైన నిద్రలేకపోతే శరీరం pH దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీంతో వయసు పైబడినట్లు కనిపిస్తారు. అలాగే డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు, ముడతలు, జుట్టు రాలిపోవడం వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు.
News October 30, 2025
అన్నదాతకు ‘మొంథా’ దెబ్బ!

‘మొంథా’ తుఫాన్ తెలంగాణపై పిడుగులా వచ్చి పడింది. ఏపీ నుంచి దిశ మార్చుకుని రాష్ట్రంలోని అన్నదాతల ఆశలను తలకిందులు చేస్తోంది. కుండపోత వానలకు వేలాది ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి నేలవాలగా, పత్తి పూర్తిగా దెబ్బతింది. మిరప తోటలు నీటమునిగాయి. పలుచోట్ల ఆరబోసిన మక్కలు తడిచిపోయాయి. పెట్టుబడి మొత్తం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
News October 30, 2025
గుడికి వెళ్తే ప్రశాంతత ఎందుకు లభిస్తుందంటే..?

ఆలయాలను అయస్కాంత శక్తి అధికంగా ఉన్న స్థలాల్లో నిర్మిస్తారు. అయస్కాంత క్షేత్రం కేంద్ర స్థానాన్ని ఎంచుకుని అక్కడ మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. దీనివల్ల ఆ శక్తి విగ్రహం ద్వారా భక్తుల శరీరం, మనసులోకి చేరుతుంది. క్షేత్రంలో కొంత సమయం గడపడం వల్ల అది మనలోని ప్రతికూలతలను తగ్గిస్తుంది. అందుకే గుడికి వెళ్తే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాల నుంచి గట్టెక్కడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.


