News September 2, 2025

కవిత కల్లోలాన్ని వివరిస్తున్న వేమన పద్యం

image

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా
విశ్వదాభిరామ వినురవేమ
—–
భావం: చెప్పులో రాయి ఉంటే నడకలో, చెవి చుట్టూ ఈగ శబ్దం చేస్తుంటే ఇబ్బందులు తప్పదు. కంట్లో నలుసు, కాలి ముల్లు మనకు గుచ్చుతూనే ఉంటాయి. అలాగే ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా మన ఇంట్లో పోరుతో మనకు బాధ ఎక్కువ.

Similar News

News September 3, 2025

రేపు చైనా విక్టరీ పరేడ్.. హాజరుకానున్న షరీఫ్, మునీర్

image

వరల్డ్ వార్-2లో గెలిచి 80 ఏళ్లవుతున్న నేపథ్యంలో చైనా రేపు విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. దీనికి పాక్ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ హాజరుకానుండటం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా నియంత కిమ్ సహా ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికాకు చెందిన పలు దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ పరేడ్‌లో సైనిక శక్తిని చాటేందుకు అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, వార్‌ హెడ్లను చైనా ప్రదర్శించనుంది.

News September 2, 2025

ఆ ప్రచారంతో ఆరు నెలలు ఆఫర్లు రాలేదు: అనుపమ

image

‘రంగస్థలం’ సినిమా ఆఫర్ వదులుకున్నానని తనపై తప్పుడు ప్రచారం జరిగిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేశారనే ప్రచారంతో తాను ఆఫర్లు లేకుండా 6 నెలలు ఖాళీగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘రంగస్థలంలో నటించాలని సుకుమార్ అడిగారు. నేను అందుకు సిద్ధమయ్యాను. అదే సమయంలో వారు వేరే హీరోయిన్‌ను నా స్థానంలో తీసుకున్నారు’ అని చెప్పారు. ఈ మూవీలో సమంత నటించిన సంగతి తెలిసిిందే.

News September 2, 2025

రాజకీయ పార్టీ నడిపిన తెలుగు వనితలు వీరే

image

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రేణుకా చౌదరి-టీడీపీ-2(1994), లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్ టీడీపీ(1996), విజయశాంతి-తల్లి తెలంగాణ(2005), కొత్తపల్లి గీత-జన జాగృతి(2018), వైఎస్ షర్మిల-వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(2021) స్థాపించారు. కానీ టీడీపీ-2, ఎన్టీఆర్ టీడీపీ తర్వాతి కాలంలో రద్దు కాగా, మిగతా పార్టీలు ఇతర పార్టీల్లో విలీనమయ్యాయి.