News August 25, 2025

జగన్‌పై విష ప్రచారం చేస్తున్నారు: భూమన

image

AP: YCP అధినేత జగన్‌పై TTD ఛైర్మన్ BR నాయుడు ఛానల్ విష ప్రచారం చేస్తోందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈనెల 27న జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారన్నారు. ‘చంద్రబాబు పాలనలో కంటే YCP హయాంలోనే కొన్ని వేల రెట్లు హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది. CMగా జగన్ ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీనివాస దివ్య హోమం ఆయన పాలనలోనే ప్రారంభమైంది’ అని వివరించారు.

Similar News

News August 26, 2025

పీఎం మోదీ డిగ్రీ వివరాలు కూడా వ్యక్తిగత సమాచారమే: ఢిల్లీ హైకోర్టు

image

ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తుల అకడమిక్ వివరాలు కూడా వ్యక్తిగత సమాచారమేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. PM మోదీ, స్మృతి ఇరానీ విద్యార్హత వివరాలను వెల్లడించాలని <<17514311>>RTI దాఖలవడంపై<<>> విచారణ జరిపింది. ‘వర్సిటీలు విద్యార్థులకు తప్ప ఇతరులకు మార్కులను బహిర్గతం చేయలేవు. మోదీ, స్మృతి విద్యార్హతలను వెల్లడించడంలో ప్రజాప్రయోజనం లేదు. RTI చట్టంలోని సెక్షన్ 8(1)(j) దీనికి మినహాయింపునిస్తుంది’ అని తెలిపింది.

News August 26, 2025

వైద్య రంగంలో ఆవిష్కరణల కోసం కార్యక్రమాలు: చంద్రబాబు

image

AP: అంతర్జాతీయ బయోడిజైన్ నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వైద్యారోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, స్టార్టప్‌ల కోసం వీరితో MOU చేసుకున్నారు. ప్రజారోగ్య రంగంలో ఆవిష్కరణలకు భారత్ బయో డిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్(BRAIN) చేపడతామని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో అంతర్భాగంగా ఈ రీసెర్చ్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఏఐ, మెడ్‌టెక్ అలయన్స్ ఫౌండేషన్-స్టాన్‌ఫోర్డ్ సహకారంతో ముందుకెళ్తామని ఆయన చెప్పారు.

News August 26, 2025

ఉచిత బస్సుల్లో త్వరలో లైవ్ ట్రాకింగ్: సీఎం CBN

image

AP: మహిళల సహకారంతో ‘స్త్రీశక్తి’ గ్రాండ్ సక్సెస్ అయిందని పథకంపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. ‘ఉచిత బస్సుల్లో త్వరలో లైవ్ ట్రాకింగ్ ఏర్పాటు చేస్తాం. స్త్రీశక్తి బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టండి. రాష్ట్ర మహిళల్లో చైతన్యం ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతారు’ అని సీఎం తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలవుతోన్న విషయం తెలిసిందే.