News March 27, 2024
డబ్బు కట్టలపై నిద్రించిన రాజకీయ నేత

అస్సాంకు చెందిన ఓ రాజకీయ నేత డబ్బుల కట్టలపై నిద్రించారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బోడోలాండ్‌కు చెందిన నేత బెంజామిన్ బసుమతారీ పలు పథకాల్లో అవినీతికి పాల్పడి.. లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయన కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News January 25, 2026
ఆదివారం రోజున మాంసాహారం తింటున్నారా?

ఆదివారమొస్తే చాలామంది మాంసాహారం తింటుంటారు. కానీ శాస్త్రాలు అది తప్పని చెబుతున్నాయి. ఎందుకంటే ఇది సూర్యుడికి అంకితమైన రోజు. ఆయన ఆరోగ్యానికి, సాత్విక శక్తికి కారకుడు. ‘స్త్రీ తైల మధు మాంసాని రవివారే విసర్జయేత్’ అనే శ్లోకం ప్రకారం ఈరోజు మాంసం తినకూడదు. ఇది మన శరీరంలో తామస గుణాన్ని పెంచుతుంది. సూర్యుని సాత్విక శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఆత్మశుద్ధి, దీర్ఘాయువు కోసం ఈ నియమాలు పాటించాలి.
News January 25, 2026
2028లో స్పేస్ స్టేషన్ పనులు ప్రారంభం: ISRO

ఇండియన్ స్పేస్ స్టేషన్ పనులు 2028లో ప్రారంభమవుతాయని ISRO ఛైర్మన్ డా.వి.నారాయణన్ వెల్లడించారు. 2035 నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఇటీవల ఫెయిలైన PSLV-C62 మిషన్ ప్రభావం ‘గగన్‌యాన్’ (మానవ సహిత అంతరిక్ష యాత్ర) ప్రాజెక్టుపై ఉండదని స్పష్టం చేశారు. చంద్రుని సౌత్ పోల్‌పై స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఘనత మనదేనని గుర్తుచేశారు. కాగా గగన్‌యాన్ మిషన్‌ను 2026 చివర్లో/2027లో ప్రయోగించే అవకాశముంది.
News January 25, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో పోస్టులు

<


