News March 26, 2024
భూమిని తాకిన పవర్‌ఫుల్ సౌర తుఫాన్

అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్ ఈ నెల 24న భూమిని తాకింది. గత 6 ఏళ్లలో భూమిని తాకిన అతి బలమైన భూ అయస్కాంత తుఫాన్ ఇదేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీని కారణంగా విద్యుత్ గ్రిడ్‌లు, నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్‌లలో చిన్న చిన్న అంతరాయాలు కలిగాయని NOAA స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది.
Similar News
News April 3, 2026
శర్వానంద్ ‘బైకర్’ మూవీ రివ్యూ&రేటింగ్

తన కొడుకు మోటోక్రాస్ ఛాంపియన్ కావాలని కలల కనే తండ్రి(రాజశేఖర్), మధ్యలోనే రేసింగ్ ఆపేసే కొడుకు(శర్వానంద్) మధ్య జరిగే కథే బైకర్. శర్వా, రాజశేఖర్ నటనతో మెప్పించారు. బైక్ రైడింగ్ విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. హీరోయిన్ మాళవిక పాత్రకు ప్రాధాన్యం దక్కింది. కొన్ని డైలాగులు బాగున్నాయి. మ్యూజిక్ ఫర్వాలేదు. ఎమోషన్ సీన్లు పెద్దగా వర్కౌట్ కాలేదు. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే మైనస్.
రేటింగ్: 2.5/5
News April 3, 2026
ముగిసిన టెన్త్ పరీక్షలు.. 6 నుంచి వాల్యుయేషన్

AP: మార్చి 16వ తేదీన మొదలైన టెన్త్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని ప్రధాన సబ్జెక్టుల్లో 99.05% అటెండెన్స్ నమోదైంది. 3,415 ఎగ్జామ్ సెంటర్లలో 6,22,152 మంది రెగ్యులర్.. 19,568 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పేపర్ల వాల్యుయేషన్ జరగనుంది. ఈ నెల నాలుగో వారంలో రిజల్ట్స్ వచ్చే అవకాశముంది.
News April 3, 2026
చెపాక్‌లో చెన్నై బోణీ కొడుతుందా?

IPL: తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న CSK ఈరోజు తన రెండో మ్యాచ్ PBKSతో ఆడనుంది. సొంతగడ్డ అయిన చెపాక్ స్టేడియంలో పంజాబ్‌ను ఓడించి బోణీ కొట్టాలని సీఎస్‌కే ఆశిస్తోంది. మరోవైపు GTపై విక్టరీతో ఉత్సాహంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 32సార్లు తలపడగా చెరో 16 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఈరోజు రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.


