News July 5, 2024
బ్లాక్ బస్టర్ మూవీకి ప్రీక్వెల్ రాబోతోంది

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ‘బింబిసార’ సినిమా గురించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. బింబిసారుడి కంటే ముందు త్రిగర్తలా రాజ్యాన్ని పాలించింది ఎవరు? ఏం జరిగిందనేది ఇందులో చూపించనున్నట్టు వెల్లడించారు. ‘బింబిసార’ను మల్లిడి వశిష్ఠ తెరకెక్కించగా ప్రీక్వెల్‌కు అనిల్ పాడూరి దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు.
Similar News
News March 3, 2026
రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 పోస్టులు

బెంగళూరులోని <
News March 3, 2026
హైదరాబాద్ to అమరావతి.. గంటన్నరలోపే!

TG: HYD ఫ్యూచర్ సిటీ నుంచి AP అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా అత్యాధునిక సెమీ బుల్లెట్ ట్రైన్ రానుంది. TG ప్రభుత్వ ప్రతిపాదనతో మిర్యాలగూడ మీదుగా ఈ అలైన్‌మెంట్ సాగనుంది. గంటకు 250km వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్‌లో గంటన్నరలోపే HYD నుంచి అమరావతికి చేరుకోవచ్చు. ఈ కారిడార్‌ను చెన్నై వరకు పొడిగిస్తే 3 గంటల్లోనే వెళ్లొచ్చు. త్వరలోనే రైల్వేశాఖ DPR సిద్ధం చేయనుంది.
News March 3, 2026
వీధి కుక్కలతోనూ బ్రాండ్ మార్కెటింగ్!

యాడ్స్ కోసం సంస్థలు హోర్డింగ్‌లు, కటౌట్‌లపై ఖర్చు చేసే బదులు సింపుల్‌గా వీధి కుక్కలను వాడుకుంటే ఎలా ఉంటుంది? ఆదిత్య అనే ఓ మాజీ మైక్రోసాఫ్ట్ టెకీకి వచ్చిన ఐడియా ఇది. ‘Stray as a Service’ అనే పేరుతో ఏఐ ఫొటోస్ కూడా షేర్ చేశారు. దేశంలో దాదాపు 3 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని వీటిని యాడ్స్‌కు వాడుకుంటే ఖర్చు తగ్గి, అవి తిరిగేచోటల్లా బ్రాండ్ ప్రమోట్ అవుతుందన్నారు. మరి ఈ ఐడియా ఎలా ఉంది? కామెంట్ చేయండి.


