News August 11, 2024

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో నిర్మాత ఎంగేజ్‌మెంట్

image

సినీ నిర్మాత, సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఒక్కటి కానున్నారు. తాము ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు శ్రావ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటో పోస్ట్ చేశారు. కాగా డైరెక్టర్ ఆర్జీవీ మేనకోడలే శ్రావ్య. నాగార్జున, విజయ్ దేవరకొండ, విక్రమ్, వైష్ణవ్ తేజ్‌లకు ఆమె డ్రెస్సులు డిజైన్ చేశారు. అలాగే కీర్తి సురేశ్ హీరోయిన్‌గా ‘గుడ్ లక్ సఖి’ అనే సినిమాను నిర్మించారు.

Similar News

News March 11, 2026

CTR: జాతరకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

image

చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పెద్దపంజాణి మండలం కమ్మినాయనపల్లికి చెందిన భరత్(20), శ్రీధర్(22), గిరి బైకుపై పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతరకు వచ్చారు. తిరిగి మంగళవారం రాత్రి ఇంటికి బయల్దేరారు. మాదనపల్లె క్రాస్ వద్ద బైకు, బొలేరో ఢీకొన్నాయి. భరత్, శ్రీధర్ అక్కడికక్కడే మృతిచెందారు. గిరి తీవ్రంగా గాయపడ్డాడు.

News March 11, 2026

కొడుకును వారసుడిగా తిరస్కరించిన ఖమేనీ?

image

తన కుమారుడు మొజ్తబా వారసుడు కావడం దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఇష్టం లేదట. ఈ మేరకు వీలునామాలో స్పష్టంగా పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ రాసుకొచ్చింది. అయినా IRGC బలవంతంగా మొజ్తబా పేరును ప్రతిపాదించి కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకునేలా చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ పాలనను వ్యతిరేకించిన అలీ ఖమేనీ నిర్ణయానికి భిన్నంగా సైన్యం ముందుకు వెళ్లడం ఇప్పుడు ఇరాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

News March 11, 2026

60 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన సిలిండర్ ధర!

image

దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం ₹7 నుంచి ₹10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో ₹913కు చేరుకుంది. 1990లో ₹120, 2010లో ₹400గా ఉన్న ధర నేడు సామాన్యుడిపై పెను భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు & ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన ఆరు దశాబ్దాలలో సిలిండర్ ధర దాదాపు వంద రెట్లు పెరగడం గమనార్హం.