News November 9, 2024

అరుదైన రోజు.. ఇవాళ దీపారాధన చేస్తే..

image

కార్తీకమాసంలో ఏ వారమైతే శ్రవణ నక్షత్రంతో వస్తుందో దాన్ని కోటి సోమవారంగా పేర్కొంటారని పండితులు చెబుతున్నారు. అదే ఈరోజు. శ్రవణ నక్షత్రం వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంటుంది. ఈరోజు ఉదయాన్నే దీపారాధాన చేస్తే తెలిసీతెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. కోటి శివలింగాలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈరోజు చేసే దానం, ఉపవాసాలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం.

Similar News

News December 6, 2025

NRPT జిల్లాలో ఈనెల 18 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్: కలెక్టర్

image

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఈనెల 18 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ శనివారం ప్రకటించారు. మొదటి, రెండవ విడత ఎన్నికలు పూర్తయిన గ్రామాలలో కూడా నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. తుదిదశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి గ్రామంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News December 6, 2025

ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్‌కు రావాలని ఆదేశం

image

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.

News December 6, 2025

కాలాలకు అతీతం ఈ మహానటి

image

తెలుగువారికి మహానటి అనగానే గుర్తొచ్చే పేరు సావిత్రి. చక్కటి అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసారు. తెలుగు, తమిళ భాషల్లో 84 చిత్రాల్లో నటించిన ఆమె సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. నటనతో, మానవత్వంతో ఎందరికో స్పూర్తినింపిన ఆమె నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండి తెరపై చెరగని ముద్ర వేశారు. నేడు మహానటి సావిత్రి జయంతి.