News September 25, 2024
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరుదైన గౌరవం

సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తమిళనాడు ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. ఆయన నివాసం ఉన్న చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా మార్చుతూ సీఎం స్టాలిన్ ప్రకటన రిలీజ్ చేశారు. అంతకుముందు ఎస్పీబీ కుమారుడు చరణ్ ఇదే విషయమై సీఎం స్టాలిన్కు వినతిపత్రం అందజేశారు.
Similar News
News November 22, 2025
ములుగు ఎస్పీగా కేకన్ బాధ్యతలు

ములుగు జిల్లా ఎస్పీగా సుధీర్ రాంనాధ్ కేకన్ బాధ్యతలు స్వీకరించారు. కొద్దిసేపటి క్రితం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న ఆయన విధుల్లో చేరారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులు కేకన్కు ఘన స్వాగతం పలికారు. నిన్నటి వరకు ములుగులో ఎస్పీగా ఉన్న శబరీష్ మహబూబాబాద్కు బదిలీ కాగా.. అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న కేకన్ను ములుగు జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేసింది.

రేపు భారత్ బంద్కు పిలుపు

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్కు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బంద్కు అంతా సహకరించాలని కోరారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, నేతలు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పలు ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.