News October 30, 2024

YCP MP విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం

image

AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (UNGA) 29వ సెషన్‌కు వెళ్లే బృందంలో ఆయనకు స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్‌’ ద్వారా తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. వచ్చే నెల 18 నుంచి 23 వరకు జరిగే ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు

Similar News

News November 27, 2025

స్విగ్గీని బురిడీ కొట్టించిన కస్టమర్.. నెటిజన్ల ఫైర్!

image

ఆన్‌లైన్‌ సైట్స్‌లో వస్తువులు డ్యామేజ్ వస్తే సదరు సంస్థ రీఫండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి డూప్లికేట్ ఫొటోతో ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ను బురిడీ కొట్టించాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసిన గుడ్ల ట్రే ఫొటోను, జెమిని నానో AI యాప్ ద్వారా గుడ్లు పగిలినట్లుగా ఎడిట్ చేసి కస్టమర్‌ కేర్‌కు పంపి, పూర్తి రీఫండ్‌ను పొందాడు. ఇలా చేయడం సరికాదని, నిజమైన బాధితులు నష్టపోతారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

News November 27, 2025

MLC రాజీనామాపై 4 వారాల్లో తేల్చండి: హైకోర్టు

image

AP: MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై నిర్ణయాన్ని తెలపాలని మండలి ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

News November 27, 2025

ఢిల్లీలో మరింత పడిపోయిన గాలి నాణ్యత!

image

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. నేడు ఉదయం గాలి నాణ్యత AQI 351గా రికార్డైంది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలతోపాటు బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురి ఏరియాల్లో AQI 300 కంటే ఎక్కువ ఉంది. బుధవారం సాయంత్రం 327 వద్ద ఉన్న గాలి నాణ్యత ఈరోజు ఉదయానికి మరింత దిగజారింది. వరుసగా 21వ రోజు కూడా AQI 300 కంటే ఎక్కువ నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.