News March 21, 2024

తిరుమలలో భక్తులకు అరుదైన అవకాశం

image

పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. అటు కోడ్ కారణంగా శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ అరుదైన అవకాశాన్ని కల్పించింది. కంపార్ట్‌మెంట్లలో ఉంచకుండా నేరుగా దర్శనానికి పంపిస్తోంది. ఇక నిన్న స్వామివారిని 69072 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 26,239 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.3.51 కోట్ల ఆదాయం లభించింది.

Similar News

News December 27, 2024

ఆస్ట్రేలియా భారీ స్కోర్.. ఆలౌట్

image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్సులో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఖవాజా 57, కొన్ట్సస్ 60, కమిన్స్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా4 , జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు.

News December 27, 2024

బీసీ మహిళలు, యువతకు GOOD NEWS

image

AP: బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 80వేల మంది BC, EBC మహిళలకు 90 రోజులపాటు టైలరింగ్‌పై శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత రూ.24,000 విలువైన కుట్టు మిషన్లు అందిస్తుంది. అలాగే డీ ఫార్మా, బీఫార్మసీ కోర్సులు చేసిన యువత జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ₹8 లక్షలు సాయం చేయనుంది. ఇందులో ₹4 లక్షలు సబ్సిడీ, ₹4 లక్షలు రుణంగా ఉంటుంది. త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేయనుంది.

News December 27, 2024

మన్మోహన్‌ను ప్రధాని చేసిన సోనియా గాంధీ

image

కాంగ్రెస్ నేతృత్వంలోని UPA 2004లో అధికారంలోకి రావడంతో సోనియా ప్రధాని అవుతారని వార్తలు వచ్చాయి. విదేశీయురాలనే కారణంతో సుష్మా స్వరాజ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ తదితర సీనియర్ నేతలు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో సోనియా అనూహ్యంగా మన్మోహన్‌కు ప్రధాని పగ్గాలు అప్పగించారు. 2009లో రెండోసారి కూడా ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం కాకుండా సింగ్‌కే అవకాశం ఇచ్చారు. 2014లో ఓడినా ఆయన్ను ఎవరూ నిందించలేదు.