News June 9, 2024
T20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు

T20 WC 2024లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచులో 366 స్కోర్(AUS 201, ENG 165) నమోదైంది. ఒక్క ప్లేయర్ కూడా 50+ స్కోర్ చేయకుండా అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచుగా ఇది రికార్డు సృష్టించింది. అంతకుముందు 2010లో SAvsNZ మ్యాచులో 327 స్కోర్ నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును AUSvsENG మ్యాచ్ బ్రేక్ చేసింది. ఈ మ్యాచులో హెడ్ 34, వార్నర్ 39, మార్ష్ 35, స్టోయినిస్ 30, బట్లర్ 42, సాల్ట్ 35 రన్స్ చేశారు.
Similar News
News September 10, 2025
రేపే లాస్ట్.. టెన్త్ అర్హతతో 2,418 ఉద్యోగాలు

సెంట్రల్ రైల్వేలో 2,418 అప్రెంటీస్ పోస్టుల దరఖాస్తుకు రేపే చివరి తేదీ. ఫిట్టర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు టెన్త్/ఐటీఐలో 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రూ.100 ఫీజు చెల్లించి https://rrccr.com/ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News September 10, 2025
కార్మికుల పిల్లలకు రూ.25,000 వరకు స్కాలర్‌షిప్

కేంద్ర ప్రభుత్వం బీడీ, గనులు, సినిమా పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు చదువును బట్టి రూ.25,000 వరకు ఏటా<
News September 10, 2025
తిరోగమనంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ: జగన్

AP: రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందని మాజీ CM జగన్ విమర్శించారు. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ ప్రయోజనాలు దోపిడీదారులకు అందుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. శాంతిభద్రతలు కనిపించడం లేదు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా’ అని ఫైర్ అయ్యారు.