News April 27, 2024
T20ల్లో అరుదైన రికార్డు నమోదు

పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు T20ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాయి. వరుసగా 3 మ్యాచుల్లో ఒకే స్కోర్ 178 నమోదు చేశాయి. 5మ్యాచ్ల సిరీస్లో 3వ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ 178/4 చేసింది. 4వ T20లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 178/7 స్కోర్ కొట్టింది. ఈరోజు 5వ మ్యాచ్లో మళ్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 178/5 నమోదు చేసింది. ఈ సిరీస్లో NZ 2-1తో ముందుంది. నేటి మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉంది.
Similar News
News October 23, 2025
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

* రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం
* SLBC టన్నెల్ను పూర్తిచేసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగు, సాగునీరు అందించాలని నిర్ణయం
* అల్వాల్, సనత్నగర్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం
* కాలపరిమితి ముగియడంతో రామగుండంలోని 52ఏళ్ల నాటి థర్మల్ స్టేషన్ను తొలగించడానికి ఆమోదం
News October 23, 2025
రూ.79వేల కోట్ల ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోదం

రూ.79వేల కోట్లతో ఆయుధాలు, పరికరాలు కొనుగోలు చేసేందుకు త్రివిధ దళాలకు ఆమోదం లభించింది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో నిర్వహించిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించారు. ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, ల్యాండింగ్ ప్లాట్ఫాం డాక్స్, 30MM నేవల్ సర్ఫేస్ గన్స్, హై మొబిలిటీ వెహికల్స్, ట్రాక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
News October 23, 2025
ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

AP: తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్పై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. గతంలో TDP నేత రమేశ్రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రచ్చకెక్కారు. తర్వాత MP కేశినేని చిన్నితో గొడవలు మొదలయ్యాయి. ఇవాళ ఆ <<18082832>>వివాదం<<>> తారస్థాయికి చేరడంతో CBN సీరియస్ అయ్యారు. ఇక మాటల్లేవని స్పష్టం చేశారు. దీంతో కొలికపూడిపై వేటు వేస్తారా? అనే చర్చ మొదలైంది.