News October 5, 2024
అరుదైన రికార్డు ముంగిట హార్దిక్

బంగ్లాతో T20 సిరీస్ ముంగిట భారత పేస్ ఆల్రౌండర్ హార్దిక్ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటి వరకు T20ల్లో 86 వికెట్లు తీసిన పాండ్య మరో 5 తీస్తే ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్గా నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భువనేశ్వర్(90) పేరిట ఉంది. మొత్తంగా చూసుకుంటే స్పిన్నర్ చాహల్ 96 వికెట్లతో టాప్లో ఉన్నారు. బుమ్రా 86 వికెట్లు తీసినప్పటికీ అతడు బంగ్లాతో సిరీస్ ఆడటం లేదు.
Similar News
News November 26, 2025
‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.

సర్పంచులకు జీతం ఎంతంటే?

TG: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో సర్పంచుల జీతంపై చర్చ జరుగుతోంది. 2021కి ముందు సర్పంచులకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఉండేది. ఆ తర్వాత నుంచి రూ.6,500 చెల్లిస్తున్నారు. ఎంపీటీసీలకు రూ.6,500, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.13,000, జడ్పీ ఛైర్మన్లకు రూ.లక్ష వరకు జీతం ఇస్తున్నారు. కాగా సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి.