News February 10, 2025
అరుదైన సన్నివేశం.. ఫీల్డింగ్ చేసిన కోచ్

క్రికెట్‌లో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. కివీస్‌తో వన్డే సందర్భంగా SA ఫీల్డింగ్ కోచ్ వండిలే గ్వావు గ్రౌండులో ఫీల్డింగ్ చేశారు. గాయపడిన ఓ ఆటగాడి స్థానంలో ఆయనే బరిలోకి దిగారు. SA20 టోర్నీ సందర్భంగా ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. 13 మందితోనే ఆ జట్టు ట్రైసిరీస్ కోసం పాక్ పర్యటనకు వచ్చింది. కాగా 2024లో బ్యాటింగ్ కోచ్ డుమినీ కూడా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశారు.
Similar News
News April 4, 2026
రష్మిక మందన్న అరుదైన ఘనత

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఈ ఏడాది క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకకు ఆమె ప్రజెంటర్‌గా హాజరు కానున్నారు. ఈ అవార్డులకు భారత్ తరఫున హాజరైన ఏకైక నటి రష్మిక. 2024లో తొలిసారిగా ఈ వేడుకకు వెళ్లిన రష్మిక ఇప్పుడు మరోసారి ఛాన్స్ దక్కించుకున్నారు. మే 23న జపాన్ రాజధాని టోక్యోలో ఈ అవార్డుల ఫంక్షన్ జరగనుంది. ఇందులో రష్మికతో పాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు.

చెన్నైకి మరో ఓటమి

IPL-2026లో చెన్నైకి మరో ఓటమి ఎదురైంది. ఇవాళ పంజాబ్‌తో జరిగిన మ్యాచులో 200+ స్కోర్ చేసినా గెలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 209/5 రన్స్ చేసింది. అనంతరం PBKSకు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (39), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ అయ్యర్ 50 (29), కనోలి 36(22) రన్స్ చేశారు. దీంతో ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపొందింది. కాగా PBKSకు వరుసగా ఇది రెండో విజయం.