News March 1, 2025

ఏటికొప్పాక బొమ్మలకు అరుదైన గౌరవం

image

AP: అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మలకు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఆ బొమ్మల స్టాల్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం శరత్ అనే కళాకారుడిని ఎంపిక చేసింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మల శకటం ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Similar News

News November 13, 2025

వరల్డ్ లాంగెస్ట్ మ్యారీడ్ కపుల్ వీరే..

image

అత్యధిక కాలంగా దాంపత్య జీవితం సాగిస్తున్న జంటగా అమెరికాకు చెందిన ఎలీనర్(107), లైల్ గిట్టెన్స్(108) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 1942లో వీరికి వివాహం కాగా 83ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే ఓల్డెస్ట్ లివింగ్ కపుల్‌గానూ ఖ్యాతి గడించారు. వీరి కంటే ముందు బ్రెజిల్‌ జంట మనోయల్, మరియా అత్యధిక కాలం(85ఏళ్లు) వైవాహిక జీవితం గడిపిన కపుల్‌గా రికార్డుల్లోకెక్కారు.

News November 13, 2025

షమీని ఎందుకు తీసుకోవట్లేదు? గిల్ సమాధానమిదే

image

షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారని IND టెస్ట్ కెప్టెన్ గిల్ అన్నారు. ఆయన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు, ఫ్యూచర్‌లో చేస్తారా అనే ప్రశ్నలకు తనకంటే సెలక్టర్లే బెటర్‌గా సమాధానం ఇవ్వగలరని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న బౌలర్లు చాలా బాగా రాణిస్తున్నారని గుర్తుచేశారు. SAతో జరగనున్న తొలి టెస్టులో ఆల్‌రౌండర్ లేదా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించే విషయంపై రేపే నిర్ణయం తీసుకుంటామన్నారు.

News November 13, 2025

రాష్ట్రంలో 107 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఏపీ మెడికల్ &హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆయూష్ విభాగంలో 107 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, MBA, M.COM, CA, ICWA, MD, BAMS, BHMS, BUMS, BNYS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, BC, EWSలకు రూ.750. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/