News April 5, 2024
‘భీమిలి’లో సిసలైన పోరు
AP: విశాఖ(D) భీమిలిలో ఎన్నికల హీట్ ఓ రేంజ్లో ఉంది. ఇద్దరు ఓటమెరుగని నేతలు గంటా శ్రీనివాసరావు(TDP), అవంతి శ్రీనివాస్(YCP) ఇక్కడ ఢీకొంటున్నారు. పార్టీ, నియోజకవర్గం మారినా గెలిచే రాజకీయ చతురులు వీరు. భీమిలిలో 2009లో అవంతి(PRP), 14లో గంటా(TDP), 19లో అవంతి(YCP) గెలుపొందారు. ఈసారి ఇద్దరు బలమైన కాపు నేతలు భీమిలి బరిలో ఉండటంతో లక్షకు పైగా ఉన్న కాపు ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠగా మారింది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 6, 2025
కుంభమేళాపై దాడి చేస్తాం: గురుపత్వంత్ పన్నూ
Jan 13 నుంచి ప్రయాగ్రాజ్లో ప్రారంభమయ్యే కుంభమేళాపై దాడి చేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. హిందూత్వ సిద్ధాంతాల్ని అంతం చేయడానికి తరలిరావాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. లక్నో, ప్రయాగ్రాజ్ విమానాశ్రయాల్లో ఖలిస్థానీ, కశ్మీర్ జెండాలను ఎగరేయాలని, కుంభమేళా-2025 యుద్ధభూమిగా మారుతుందని చెప్పుకొచ్చాడు. పన్నూ గతంలోనూ ఇలాంటి హెచ్చరికలు చేశాడు.
News January 6, 2025
ఘోరం.. పిల్లలకు విషమిచ్చి పేరెంట్స్ ఆత్మహత్య
బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్, అతని భార్య తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసి తామూ ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనూప్ కుమార్(38), రాఖీ(35), అనుప్రియ(5), ప్రియాంశ్(2)గా గుర్తించారు. వీరి స్వస్థలం యూపీలోని ప్రయాగ్ రాజ్ అని పోలీసులు తెలిపారు. తీవ్ర ఆర్థిక సమస్యలతోనే సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
News January 6, 2025
రెండు గ్రామాల మధ్య ‘దున్నపోతు’ పంచాయితీ
AP: దేవర దున్నపోతు కోసం అనంతపురం(D)లోని 2 గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. కూడేరు(M) ముద్దలాపురం, కదరగుంటలో దేవర నిర్వహణకు ఇరు గ్రామాల ప్రజలు నిర్ణయించారు. బలి ఇవ్వడానికి చెరో దున్నపోతును ఎంపిక చేశారు. అయితే గ్రామంలోకి వచ్చిన దున్నపోతును కదరగుంట వాసులు బంధించగా, అది తమదేనని ముద్దలాపురం ప్రజలు వాదిస్తున్నారు. గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ వ్యవహారం SP వరకు వెళ్లింది.