News April 25, 2024

రికార్డ్ సృష్టించిన IPL-2024

image

క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న IPL సగం సీజన్ పూర్తయింది. మొత్తం 74 మ్యాచుల్లో నిన్న CSK, LSG మధ్య గేమ్‌తో 37 మ్యాచులయ్యాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పటికే 8.99 రన్‌రేట్‌తో IPLలో మోస్ట్ హైస్కోరింగ్ సీజన్‌గా ఇది రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 7 సెంచరీలు, 668 సిక్సర్లు నమోదయ్యాయి. టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోర్ (SRH-287) రికార్డు కూడా బద్దలైంది.

Similar News

News November 22, 2025

అప్పుగా తెచ్చిన ₹2.30L కోట్లు ఏమయ్యాయ్: KTR

image

TG: అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న CM క్షమాపణలు చెప్పాలని KTR డిమాండ్ చేశారు. నెలకు ₹2300 CR కూడా లేని వడ్డీని ₹7వేల కోట్లుగా అబద్ధాలు చెబుతున్నట్లు ‘కాగ్’ నివేదిక బట్టబయలు చేసిందని చెప్పారు. BRS పదేళ్లలో ₹2.8L కోట్ల రుణం తెస్తే కాంగ్రెస్ 23నెలల్లోనే ₹2.30L కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించలేదని, అప్పు తెచ్చిన రూ.లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

News November 22, 2025

PHOTO GALLERY: గరుడ వాహనంపై తిరుచానూరు అమ్మవారు

image

AP: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. దీనిని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీవారికి గరుడ సేవ ప్రీతిపాత్రమైనదిగా పండితులు చెబుతారు. తిరుచానూరులో ఆ సేవ జరిగే టైంలో శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి బంగారు పాదాలను పంపుతారని ప్రతీతి.

News November 22, 2025

దేవుడు పిలుస్తున్నాడంటూ.. కుటుంబం ఆత్మహత్య

image

HYD అంబర్‌పేట్‌కు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులు వారి కూతురు శ్రావ్యతో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిరోజుల కిందట వారి పెద్ద కూతురు కూడా సూసైడ్ చేసుకుంది. తర్వాత ఈ ఫ్యామిలీ రాంనగర్ నుంచి అంబర్‌పేట్‌కు మారింది. తమనీ దేవుడు పిలుస్తున్నాడని, పెద్ద కూతురి దగ్గరికే వెళ్తామని చుట్టుపక్కల వాళ్లతో చెప్పినట్లు సమాచారం. దీంతో మూఢనమ్మకాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.