News August 8, 2024

హీరో రాజ్‌తరుణ్‌కు ఊరట

image

తెలంగాణ హైకోర్టులో నటుడు రాజ్‌తరుణ్‌కు ఊరట దక్కింది. నార్సింగి పీఎస్‌లో నమోదైన కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ దక్కింది. రూ.20వేల పూచీకత్తుతో రాజ్‌తరుణ్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మాజీ ప్రేయసి లావణ్య ఫిర్యాదులో నటుడిపై కేసు నమోదైంది.

Similar News

News December 27, 2025

HYD: ఆశ్చర్యం.. కంటైనర్‌లో వైన్ షాప్

image

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే కంటైనర్‌లోనే వైన్ షాప్ ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజూరైన ఓ వైన్ షాప్ రెడీ కాకపోవడంతో దుకాణదారుడు రోడ్డు పక్కనే కంటైనర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ప్రధాన రహదారిపై ఇలా కంటైనర్‌లో వైన్ షాప్ నడపడం చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

News December 27, 2025

18ఏళ్లైనా న్యాయం జరగలేదు: ఆయేషా పేరెంట్స్

image

AP: తమ కూతురు ఆయేషా <<10606883>>మీరా<<>> హత్య జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా ఇంకా న్యాయం జరగలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో సీబీఐ, సిట్ విఫలమయ్యాయని మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ కూడా సరిగ్గా చేయలేదని ఆరోపించారు. సామాన్యులకు న్యాయం జరగదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని వినతిపత్రంలో కోరారు.

News December 27, 2025

51 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఎయిమ్స్<<>> రాయ్‌పుర్ 51 కాంట్రాక్ట్ జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MBBS ఉత్తీర్ణులైన వారు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in