News March 29, 2024
వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేల్చిన ఇద్దరు కీలక నిందితుల కోసం వేట కొనసాగుతోంది. వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు ఇస్తామని NIA ప్రకటించింది. నిందితుల ఆచూకీ తెలిసిన వాళ్లు 89042 41100 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపింది. కాగా ఈ కేసులో ఇప్పటికే NIA ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసింది. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు గాయపడ్డ విషయం తెలిసిందే.
Similar News
News January 29, 2026
ఈ 4 పండ్లు తింటే టైప్-2 డయాబెటిస్ ముప్పు

సపోటాల్లోని విటమిన్ A, C, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫ్రక్టోజ్, సుక్రోజ్ రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుతాయి. అరటిపండులో ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉన్నందున వారానికి 2-3 కంటే ఎక్కువ తీసుకోకూడదు. మామిడి పండ్లు, సీతాఫలం తిన్నా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉండడంతో రెగ్యులర్‌గా తినకూడదు. షుగర్ కంట్రోల్లో లేనివారు/ఇన్సులిన్ వాడతున్న వారు డాక్టర్ సలహా తీసుకోవాలి.
News January 29, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 29, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 29, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.25 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


