News August 8, 2024
మెడల్ సాధించకపోయినా రూ.25,00,000 రివార్డ్

పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వినేశ్ ఫొగట్కు రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. వినేశ్ మెడల్ గెలిచినట్లేనని వర్సిటీ ఛాన్స్లర్ అశోక్ తెలిపారు. ‘వినేశ్ మా యూనివర్సిటీలో MA (సైకాలజీ) స్టూడెంట్. ఆమె దృఢ సంకల్పం, స్కిల్ చాలా గొప్పవి’ అని ఆయన చెప్పారు. తమ విద్యార్థులు గోల్డ్ గెలిస్తే రూ.50 లక్షలు, సిల్వర్కు రూ.25 లక్షలు, బ్రాంజ్ గెలిస్తే రూ.10 లక్షలు ఇస్తామని గతంలో LPU ప్రకటించింది.
Similar News
News October 24, 2025
సర్వీసు ఇనాం భూములకు త్వరలోనే పరిష్కారం: అనగాని

AP: సర్వీసు ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి దేవాదాయశాఖ అధికారులు, తహశీల్దార్లతో కమిటీలు వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 45 రోజుల్లో నివేదిక ఇస్తారని, దానిపై CMతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై GOM సమావేశం జరగ్గా అనగానితో పాటు నారాయణ, పయ్యావుల, ఫరూక్ పాల్గొన్నారు. పరిశ్రమలు, ఇతర భూముల కేటాయింపుపై సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
News October 24, 2025
నింగిలోకి ఎగిరిన తొలి స్వదేశీ ట్రైనర్ ఫ్లైట్

స్వదేశీ సాంకేతికతతో డెవలప్ చేసిన భారత తొలి ట్రైనర్ ఫ్లైట్ నింగిలోకి ఎగిరింది. బెంగళూరులో తయారు చేసిన హిందుస్థాన్ టర్బో ట్రైనర్-40(HTT-40) అందుబాటులోకి వచ్చినట్లు HAL వెల్లడించింది. దీని ద్వారా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ వారియర్స్ శిక్షణ పొందుతారంది. ముందు ఒకరు, వెనుక మరొకరు కూర్చునేలా డిజైన్ చేసింది. బేసిక్ ఫ్లైట్ ట్రైనింగ్, వైమానిక విన్యాసాలు, నైట్ ఫ్లైయింగ్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉపయోగపడనుంది.
News October 24, 2025
అడవులను కబ్జా చేస్తే ఎవరినీ ఉపేక్షించం: పవన్

AP: అడవుల ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని Dy.CM పవన్ హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్లో మాట్లాడారు. ‘శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తాం. అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తాం. రాష్ట్రంలో గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణానికి కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు.


