News December 9, 2024
ఏడాదికి రూ.2కోట్ల జీతం

TG: వికారాబాద్(D) బొంరాస్పేట(M) తుంకిమెట్లకు చెందిన సయ్యద్ అర్బాజ్ ఖురేషి జాక్పాట్ కొట్టారు. 2019లో IIT పట్నాలో బీటెక్ పూర్తి చేసిన ఇతను 2023లో AI, మెషీన్ లెర్నింగ్లో MS పట్టా పొందారు. MSలో చూపిన ప్రతిభ ఆధారంగా దిగ్గజ సంస్థ అమెజాన్ అమెరికాలో అప్లైడ్ సైంటిస్టుగా రూ.2కోట్ల వార్షిక వేతనానికి ఎంపిక చేసింది. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఖురేషి యువతకు సూర్ఫినివ్వాలని అతని తండ్రి ఆకాంక్షించారు.
Similar News
News January 6, 2026
కర్నూలు: ‘సంక్షేమ వసతి గృహాలు మెరుగ్గా పనిచేయాలి’

సంక్షేమ వసతి గృహాలు మెరుగ్గా పనిచేయాలని రాష్ట్ర BC వెల్ఫేర్ ఎక్స్-అఫీషియో కార్యదర్శి సత్యనారాయణ ఆదేశించారు. కర్నూలులోని సునయన ఆడిటోరియంలో మంగళవారం కర్నూలు, కడప, అనంతపురం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు.
News January 6, 2026
విజయ్కు కొత్త చిక్కులు

తమిళ స్టార్ హీరో విజయ్కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన చివరి సినిమాగా పేర్కొంటున్న ‘జన నాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కావాల్సి ఉండగా ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. దీనిపై మూవీ టీమ్ కోర్టును ఆశ్రయించగా రేపు విచారణ జరగనుంది. మరోవైపు టీవీకే పార్టీ మీటింగ్ ర్యాలీలో <<18778497>>తొక్కిసలాట<<>> ఘటన కేసు CBIకి చేరింది. దీనిపై ఈ నెల 12న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.
News January 6, 2026
ఇతిహాసాలు క్విజ్ – 119 సమాధానం

ప్రశ్న: రామాయణంలో ఏ 2 విష్ణు అవతారాలు పరస్పరం ఎదురుపడ్డాయి? ఆ సందర్భం ఏంటి?
జవాబు: రామాయణంలో రాముడు, పరశురాముడు ఎదురుపడతారు. సీతాకళ్యాణం ముగించుకుని అయోధ్యకు వెళ్లేటప్పుడు శివధనుస్సు విరిచిన రాముడిని ఎదుర్కునేందుకు పరశురాముడు వస్తాడు. రాముడిలోని దైవాన్ని గుర్తించి తన అవతార సమాప్తిని ప్రకటించి తపస్సుకి వెళ్లిపోతాడు. ఇది ఒకేసారి 2 విష్ణు అవతారాలు కలిసిన అరుదైన సందర్భం. <<-se>>#Ithihasaluquiz<<>>


