News September 22, 2025
ఆడపిల్ల కోసం ఓ చందనం మొక్క

బిహార్‌లోని వైశాలి జిల్లా పకోలి గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. అక్కడ ఆడపిల్ల పుడితే ఇంటి ఆవరణలో చందనం మొక్కను నాటుతారు. దాన్ని జాగ్రత్తగా సంరక్షించి కుమార్తె పెద్దయ్యాక ఆ చెట్టును అమ్మగా వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి చేస్తారు. వీరు పెంచే మల్యగిరి రకం చందనం చెట్లు విక్రయిస్తే, దాని వయసును బట్టి రూ.2 లక్షల వరకు వస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు. పిల్లల ఉన్నత విద్య కోసం కూడా కొందరు వీటిని పెంచుతున్నారు.
Similar News
News September 22, 2025
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్

TG: గోదావరి నదిపై సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. NOCకి అంగీకరిస్తున్నట్లు విష్ణుదేవ్ తెలిపారు. భూసేకరణ, నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. 6.7 టీఎంసీల సామర్థ్యంతో ములుగు జిల్లాలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
News September 22, 2025
స్వచ్ఛమైన ప్రకృతి వనరులను అందించాలి: పవన్

AP: పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకెళ్లాలని Dy.CM పవన్ పేర్కొన్నారు. అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శితో ఆయన భేటీ అయ్యారు. ‘కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలి. మండలి విధులు, నిధులు, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు అర్థమయ్యేలా సమగ్ర నివేదిక సిద్ధం చేయండి. సాధ్యమైనంత స్వచ్ఛంగా ప్రకృతి వనరులను భావి తరాలకు అందించే లక్ష్యంతో పని చేయాలి’ అని దిశానిర్దేశం చేశారు.
News September 22, 2025
గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం: రవూఫ్ భార్య

పాక్ మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన పనితో గర్వంగా ఉన్నానని ఆ జట్టు బౌలర్ హారిస్ రవూఫ్ భార్య ముజ్నా మసూద్ తెలిపింది. నిన్న మ్యాచ్ సందర్భంగా రవూఫ్ ‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో <<17788891>>సంజ్ఞలు<<>> చేశాడు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ముజ్నా.. ‘గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం’ అని పేర్కొంది. యుద్ధమైనా, ఆటైనా గెలిచేది భారతే అని టీమ్ ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.