News September 7, 2024

ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై దుమారం

image

కశ్మీరీ వేర్పాటువాది అఫ్జల్ గురును ఉరి తీయ‌డం వ‌ల్ల ఏదైనా ప్ర‌యోజ‌నం నెర‌వేరిన‌ట్టు తాను భావించడం లేదని JK మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్య‌ల‌కు బీజేపీ కౌంట‌ర్ ఇస్తూ కాంగ్రెస్ ఎప్ప‌టికీ ఉగ్ర‌వాదుల‌తోనే ఉంటుందంటూ ఆరోపించింది. అఫ్జ‌ల్‌ను ఉరితీయ‌డం వ‌ల్ల ఎలాంటి మంచి జ‌ర‌గ‌లేదంటున్న ఇండియా కూటమి సుప్రీంకోర్టు నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నిస్తోందా అని నిల‌దీసింది.

Similar News

News November 24, 2025

జగిత్యాల: గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు పరిశీలించిన ఎస్పీ

image

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 6 మంది అర్జీదారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను విన్నారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువ కావడం లక్ష్యంగా ప్రతి ఫిర్యాదుపై మర్యాదపూర్వకంగా స్పందించి, క్షేత్రస్థాయి పరిశీలనతో వేగంగా న్యాయం జరిగేలా చూడాలన్నారు.

News November 24, 2025

గులాబీలో చీడలను ఎలా నివారించవచ్చు?

image

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్‌ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.

News November 24, 2025

హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

image

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.