News December 8, 2024
రెండో వారంలో వరుస IPOలు

స్టాక్ మార్కెట్లలోకి Mon నుంచి IPOలు క్యూకట్టనున్నాయి. ముఖ్యంగా Dec 11న విశాల్ మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్ రానున్నాయి. 12న ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, 13న ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ రానున్నాయి. అలాగే SMEలో Dhanlaxmi Crop Science, Jungle Camps India, Toss The Coin, Purple United Sales, Supreme Facility Management, Yash High voltage ఈ వారం IPOకు రానున్నాయి.
Similar News
News November 22, 2025
HBTUలో 29 టీచింగ్ పోస్టులు

యూపీలోని హర్కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ (HBTU) 29 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. MCA, PG, PhD, ME, M.Tech, NET/SET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://hbtu.ac.in/
News November 22, 2025
రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్ను ఇస్తుందని సూచించారు. SHARE IT
News November 22, 2025
షూటింగ్లో గాయపడిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్లో శ్రద్ధా నటిస్తున్నారు.


