News August 8, 2025
వరుస అల్పపీడనాలు.. ముప్పు పొంచి ఉందా?

AP: ఈ నెలలో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ఈ నెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడి, పశ్చిమ దిశగా కదులుతుందని అంచనా వేశారు. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత వెంటవెంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని, అవి తుపాన్లుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Similar News
News August 8, 2025
ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారికి షాక్

ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవారిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరించారు. వారానికి 3 సార్లు తినే వారిలో 20శాతం డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని తమ రీసెర్చ్‌లో తేలిందని వెల్లడించారు. అంతే మొత్తంలో ఉడికించి, కాల్చిన బంగాళాదుంపలను తింటే ముప్పు ఈ స్థాయిలో ఉండదని హార్వర్డ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీల పరిశోధకులు 40 ఏళ్లుగా జరిపిన నివేదికలను బయటపెట్టారు.
News August 8, 2025
ట్రంప్ ఎఫెక్ట్.. నష్టాల్లో మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండగా.. సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంతో 80,126 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 24,444 వద్ద ట్రేడవుతున్నాయి. టైటాన్, NTPC, బజాజ్ ఫైనాన్స్, ITC షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
News August 8, 2025
బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్

శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాల వేళ బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. వరుసగా ఐదో రోజూ బంగారం ధరలు పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹760 పెరిగి ₹1,03,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹700 పెరిగి ₹94,700 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.