News June 16, 2024

వరుస ఉగ్రదాడులు.. నేడు షా కీలక సమావేశం

image

J&Kలో ఉగ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తదితరులు హాజరు కానున్నారు. ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన భద్రతపైనా షా చర్చించనున్నారు.

Similar News

News October 17, 2025

స్వీట్ పొటాటో తింటున్నారా?

image

చిలగడదుంప (స్వీట్ పొటాటో) పోషకాల గని అని నిపుణులు చెబుతున్నారు. ‘ఒక మీడియం సైజు ఉడికించిన స్వీట్ పొటాటో మీ రోజువారీ విటమిన్ A అవసరాలను 100% పైగా అందిస్తుంది. ఇది కంటి చూపునకు, బలమైన రోగనిరోధక శక్తి & గుండె, మూత్రపిండాల వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులోని శక్తిమంతమైన బీటా-కెరోటిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలో మంటను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది’ అని తెలిపారు.

News October 17, 2025

వంటింటి చిట్కాలు

image

* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి, ఫ్రిజ్‌లో పెడితే నల్లగా మారవు.
<<-se>>#VantintiChitkalu<<>>

News October 17, 2025

BCCI అపెక్స్ కౌన్సిల్‌లో చాముండేశ్వరనాథ్

image

భారత మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ చాముండేశ్వరనాథ్‌కు BCCI అత్యున్నత కమిటీలో చోటు దక్కింది. బోర్డు అపెక్స్ కౌన్సిల్‌లో ICA ప్రతినిధిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో వి.జడేజాపై ఆయన గెలుపొందారు. దీంతో అపెక్స్ కౌన్సిల్‌కు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. రాజమండ్రికి చెందిన ఈయన ఆంధ్ర తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గానూ పనిచేశారు.