News February 19, 2025
ఆరంభంలోనే పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. కాగా ప్రేక్షకులు లేక కరాచీ స్టేడియం వెలవెలబోతోంది. గ్రౌండ్‌లో ఎక్కడ చూసినా ఖాళీ స్టాండ్స్ దర్శనమిస్తున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో క్రికెట్ ప్రేమికులు పాకిస్థాన్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇంత పెద్ద టోర్నీని చూసేందుకు పాక్ ఫ్యాన్స్ ఆసక్తి చూపడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News November 27, 2025
కృష్ణా నదీ జలాలపై హక్కులను వదులుకోం: సీఎం

AP: కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను వదులుకునేది లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని జలవనరుల శాఖ అధికారుల సమీక్షలో దిశానిర్దేశం చేశారు. నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులకు వీలులేదని, చట్టపరంగా దక్కిన వాటాను కొనసాగించాల్సిందేనని చెప్పారు. ఏటా వేలాది <<16807228>>TMC<<>>ల జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరించాలన్నారు.
News November 27, 2025
హీరోయిన్ కూడా మారారా!

‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కించనున్న ఎల్లమ్మపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారని ప్రచారం జరగ్గా, ఆ వార్తలను ఆమె తాజాగా కొట్టిపడేశారు. దీంతో ఇన్నాళ్లు ఈ మూవీ హీరోల పేర్లే మారాయని, ఇప్పుడు హీరోయిన్ కూడా ఛేంజ్ అయ్యారా? అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తారని నితిన్, నాని, బెల్లంకొండ సాయి, శర్వానంద్ పేర్లు వినిపించి DSP దగ్గర ఆగిన విషయం తెలిసిందే.
News November 27, 2025
స్వెటర్లు ధరిస్తున్నారా?

చలికాలంలో స్వెటర్లు వాడటం కామన్. అయితే వాటి శుభ్రతపై నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్యులు. ప్రతి 5-7సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచిస్తున్నారు. వాటి క్వాలిటీ, ఎంతసేపు ధరించాం, లోపల ఎటువంటి దుస్తులు వేసుకున్నాం, శరీర తత్వాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందట. స్వెటర్ లోపల కచ్చితంగా దుస్తులు ఉండాలని, శరీరం నుంచి తొలగించిన తర్వాత గాలికి ఆరబెట్టాలని.. లేకపోతే చర్మవ్యాధులకు ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు.


