News November 14, 2024
పాక్‌కు షాక్.. భారత్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై నీలినీడలు కమ్ముకున్న సమయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ విధానానికి అంగీకరించకపోతే ఈ టోర్నీ భారత్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ ఆడటానికి భారత్‌కు రాకపోతే శ్రీలంకను క్వాలిఫై చేస్తారని టాక్. ఈ విషయంపై ICC తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా CT పాక్‌లో జరగాల్సి ఉంది. కానీ అక్కడికి వెళ్లేందుకు ఇండియా ససేమిరా అంటోంది.
Similar News
News February 4, 2026
ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

<
News February 4, 2026
జట్లు వేరైనా మూలాలు మనవే!

FEB 7న మొదలుకానున్న T20 WCలో దాదాపు 35+ భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. USA సారథి మోనాంక్ పటేల్, కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా, ఒమన్ సారథి జతీందర్ సింగ్‌లతో పాటు USA పేసర్ సౌరభ్ వంటి ప్లేయర్స్ విదేశీ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు భారత్-అమెరికా జట్ల మధ్య పోరును నెటిజన్లు ‘పాస్‌పోర్ట్ VS గ్రీన్ కార్డ్’ మ్యాచ్ అని సరదాగా జోకులు పేలుస్తున్నారు.
News February 4, 2026
భార్య అందంగా ఉందని గుండు గీశాడు

కర్ణాటలోని బాగల్‌కోట(D)లో అమానవీయ ఘటన జరిగింది. అందంగా ఉన్న తన భార్యను ఇతర పురుషులు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె జుట్టు పొడుగ్గా ఉందని, అందంగా పూలతో అలంకరించుకుంటూ యువకులను వలలో వేసుకుంటోందని అతను భావించాడు. రాత్రి ఫుల్లుగా తాగి భార్యను కత్తితో బెదిరించి గుండు చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.


