News March 22, 2024

యాపిల్‌కు షాక్.. ఒక్క రోజులో రూ.9.41 లక్షల కోట్లు నష్టం

image

ఏకపక్ష విధానాలతో పోటీ సంస్థల మనుగడను ‘యాపిల్’ ప్రశ్నార్థకం చేస్తోందని, ధరలను కృత్రిమంగా పెంచుతోందని అమెరికా ప్రభుత్వం దావా వేసింది. దీంతో యాపిల్ షేర్లు 4.1 శాతం నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 113 బిలియన్ డాలర్లు(రూ.9.41 లక్షల కోట్లు) తగ్గిపోయింది. మొత్తంగా కంపెనీ షేరు విలువ ఈ ఏడాది 11 శాతం వరకు తగ్గడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఆరోపణలను యాపిల్ కొట్టిపారేసింది.

Similar News

News November 20, 2025

పండ్ల తోటల్లో పిందె/కాయలు రాలకుండా ఉండాలంటే?

image

పిందె, కాయలు ఎదిగే దశల్లో, పోషక లోపాల నివారణ కోసం, సూక్ష్మ, స్థూల పోషకాలను అందించాలి. కాయ ఎదుగుతున్న దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పండ్ల తోటలను ఆశించే పురుగులు, తెగుళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నివారణ చర్యలను పాటించాలి. అధిక సంఖ్యలో పిందెలు ఏర్పడితే బలహీనమైన, తక్కువ పరిమాణంలో ఉన్న పిందెలను తీసేస్తే పోషకాలు సమానంగా అంది రాలడం తగ్గుతుంది. పండు ఈగ కట్టడికి మిథైల్ యూజినాల్ ఎర వాడాలి.

News November 20, 2025

Alert: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు

image

AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని APSDMA తెలిపింది. తర్వాత 48 గంటల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని తెలిపింది.

News November 20, 2025

‘1600’ సిరీస్‌తోనే కాల్స్.. ట్రాయ్ కీలక ఆదేశాలు

image

దేశంలో పెరిగిపోతున్న స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సంస్థలు తమ సర్వీసు, లావాదేవీల కాల్స్ కోసం 1600తో మొదలయ్యే నంబర్ సిరీస్‌ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు జనవరి 1 నాటికి, పెద్ద NBFCలు, పేమెంట్స్ బ్యాంకులు ఫిబ్రవరి 1 కల్లా, మిగతా NBFCలు, సహకార బ్యాంకులు, RRBలు మార్చి 1 లోపు ఈ సిరీస్‌‌కు మారాల్సి ఉంది.