News April 12, 2024
లోన్లు తీసుకునేవారికి షాక్

బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్లపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 8.05% నుంచి 8.10శాతానికి పెరిగింది. 3నెలల లోన్లపై 8.45శాతానికి చేరుకోగా, 6నెలల రుణాలపై 8.65%, ఏడాది రుణాలపై 8.85శాతానికి పెరిగింది. ఇవి నేటి నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అటు HDFC వడ్డీ రేటును పెంచడంతో గృహ రుణాలపై వడ్డీరేటు 9.05% నుంచి 9.8% మధ్య ఉంది.
Similar News
News November 27, 2025
మంచిర్యాల: 90 సర్పంచ్, 816 వార్డు స్థానాలకు నామినేషన్

మంచిర్యాల జిల్లాలోని తొలి విడతలో 4 మండలాల్లో 90 సర్పంచ్, 816వార్డుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దండేపల్లి (M)లో 31 GPలు, 278 వార్డులు, హాజీపూర్ (M)లో 12 GPలు,106 వార్డులు, జన్నారం (M)లో 29 GPలు, 272 వార్డులు, లక్షెట్టిపేట (M)లో 18 GPలు,160 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు.
News November 27, 2025
చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్

ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. తాజా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో స్వర్ణం గెలిచారు నిఖత్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత విరామం తీసుకున్న నిఖత్, తిరిగి రింగ్‌లో అడుగుపెట్టి తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ వేదికపై నిఖత్ పతకం సాధించడం విశేషం. ఈ మెడల్ భారత మహిళా బాక్సింగ్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
News November 27, 2025
గంభీర్‌పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ఉండదు: BCCI

తన భవిష్యత్తుపై బీసీసీఐదే <<18393677>>నిర్ణయమన్న<<>> టీమ్ ఇండియా కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై బోర్డు స్పందించింది. ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఓ అధికారి వెల్లడించినట్లు NDTV పేర్కొంది. ప్రస్తుతం జట్టు మార్పుల దశలో ఉందని ఆయన తెలిపారు. అయితే కోచ్ మార్పు ఉండదని బీసీసీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. కాగా భారత్ వరుస టెస్ట్ సిరీస్‌ల ఓటమి నేపథ్యంలో గంభీర్‌ను తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి.


