News March 18, 2024
బోధన్ మాజీ ఎమ్మెల్యేకి షాక్

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో మరో షాక్ తగిలింది. జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. 2022 మార్చి 17న జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 45లో యాక్సిడెంట్ జరగ్గా.. ఆ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 23, 2025
NZB: జీవితంపై విరక్తి చెందిన మహిళ మృతి

నవీపేట్ మండలం సిరన్ పల్లి వడ్డెర కాలనీకి చెందిన మల్లవ్వ(40) గత కొంతకాలంగా మద్యానికి బానిసై ఇంట్లో భర్తతో గొడవపడేది. ఈ నెల 14 వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. పొలంలో ఉన్న బావి నుంచి దుర్వాసన రావడంతో శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవీపేట ఎస్ఐ మృతదేహాన్ని బావి నుంచి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News February 23, 2025
NZB: పసుపు రైతులు ఈ విషయాన్ని గమనించాలి

మహాశివరాత్రి సందర్భంగా లేబర్ హాలిడే కారణంగా ఫిబ్రవరి 26 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని అలాగే మార్చి 1, 2 తేదీలలో శనివారం, ఆదివారం గంజ్ తెరిచి ఉన్న పసుపుకు సంబంధించిన లావాదేవీలు ఉండవని అధికారులు తెలిపారు. తిరిగి మళ్లీ మార్చ్ 3న ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పసుపు రైతులు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
News February 23, 2025
NZB: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: కిషన్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నిజామాబాద్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. 400 రోజులు దాటినా ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.