News November 14, 2024

ఓలాకు షాక్‌.. రంగంలోకి BIS

image

Ola Electric నాణ్య‌తా, స‌ర్వీసు ప్ర‌మాణాల లోపం ఆరోప‌ణ‌ల‌పై Bureau of Indian Standards విచారణ జరుపుతుందని వినియోగదారుల శాఖ అధికారి ఒకరు తెలిపారు. యూజర్ల నుంచి 10 వేల‌కుపైగా ఫిర్యాదులు అంద‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా CCPA గ‌తంలో నోటీసులు ఇచ్చింది. అయితే అవి కేవ‌లం సాఫ్ట్‌వేర్ వినియోగం అర్థంకాకపోవ‌డం, లూస్ పార్ట్స్ స‌మ‌స్య‌ల‌ని ఓలా పేర్కొంది. అయితే, దీనిపై విచార‌ణ బాధ్యత‌ను BISకు CCPA అప్ప‌గించింది.

Similar News

News October 25, 2025

హైదరాబాద్‌లో స్టార్‌లింక్ ఎర్త్ స్టేషన్?

image

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ మన దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా దేశంలోని 9 సిటీల్లో ఎర్త్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్, ముంబై, నోయిడా, చండీగఢ్, కోల్‌కతా, లక్నో తదితర నగరాలు ఈ లిస్టులో ఉన్నాయని సమాచారం. జాతీయ భద్రత దృష్ట్యా టెస్టింగ్ దశలో స్టార్‌లింక్‌కు కఠిన ఆంక్షలతో కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చింది.

News October 25, 2025

తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

image

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News October 25, 2025

ఇంటి చిట్కాలు

image

* 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో 1 వంతు గోరువెచ్చని నీళ్లు పోసి క్లీనర్ రెడీ చేసుకోవాలి. దీంతో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఫ్యాన్లు, ఏసీలపై మరకలు సులువుగా పోతాయి
* క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్‌ను స్టీలు స్క్రబ్బర్‌తో గట్టిగా తోమితే కుక్‌వేర్ పొర పోవచ్చు. వీటిని స్పాంజ్ స్క్రబ్బర్‌తో మైల్డ్ డిష్ సోప్ ఉపయోగించి తోమాలి.
* షవర్ జామ్ అయితే కాస్త వెనిగర్, నీళ్లు కలిపి దానికి పట్టేలా రాసి, గంట తర్వాత కడిగేయాలి.