News October 23, 2024
BRICSలో పాక్‌కు షాక్!
బ్రిక్స్ సదస్సులో పాక్‌కు షాక్ తగిలింది. తన మిత్రదేశం చైనా కీలక సభ్యదేశమైనప్పటికీ ఇస్లామాబాద్‌ను బ్రిక్స్ విస్తరణలో పరిగణించలేదు. భారత్ వ్యతిరేకించడంతో రష్యాలో జరుగుతున్న సదస్సులో పాక్ ప్రతినిధికి స్థానం కూడా దక్కలేదు. బ్రిక్స్ విస్తరణలో ఇప్పటికే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE, సౌదీ అరేబియా చేరాయి. తుర్కియే, అజర్బైజాన్, మలేషియా దరఖాస్తు చేసుకున్నాయి.
Similar News
News January 3, 2025
నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఘటనకు, అల్లు అర్జున్‌కు సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
News January 3, 2025
రైలు పట్టాలపై పబ్జీ.. ముగ్గురు యువకుల మృతి
పబ్జీ ఆట పిచ్చి బిహార్‌లో ముగ్గురు టీనేజీ యువకుల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్జీ ఆడుతున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు. వారిపైనుంచి రైలు వెళ్లిపోయింది. దీంతో అందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
News January 3, 2025
ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TG: సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 24 రోజులుగా వారు విధులకు రాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.