News April 1, 2024
టీడీపీకి షాక్.. రెబల్‌గా మీసాల గీత పోటీ

AP: విజయనగరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మీసాల గీత రెబల్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి టికెట్‌ను అదితి గజపతిరాజుకు ఇవ్వడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి విజయనగరం మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
Similar News
News January 31, 2026
ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 31, 2026
మొక్కజొన్నలో జింక్ లోపం – నివారణ

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మోతాదుకు మించి భాస్వరం ఎరువులను వాడినప్పుడు, అధిక నీటి ముంపునకు గురైనప్పుడు మొక్కజొన్నలో జింక్ లోపం కనబడుతుంది. దీని వల్ల ఆకుల, ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు, తెలుపు రంగుగా మారతాయి. పంట ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. జింక్ లోపం నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 31, 2026
స్పటిక మాలను ఎందుకు ధరించాలి?

స్పటిక మాలను ధరిస్తే మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. ఇది శుక్ర గ్రహాన్ని బలపరిచి సంపద, కీర్తి, ఆకర్షణను ప్రసాదిస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగి శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి మనస్సును చల్లబరుస్తుంది. మనస్సును నిగ్రహించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తూ ధరిస్తే సానుకూల శక్తి పెరుగుతుంది.


