News September 18, 2024

పండగ ముందు సామాన్యుడికి షాక్.. రూ.170కి చేరిన వంట నూనె

image

వంట నూనె ధరలు పెరగడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు రెండు రోజుల వ్యవధిలోనే లీటర్‌కు రూ.15-20 పెరిగాయి. పిండి వంటలకు ఎక్కువగా ఉపయోగించే వేరుశనగ నూనె గరిష్ఠంగా రూ.170కి చేరింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.

Similar News

News November 19, 2025

కాకినాడ మీదుగా శ్రీలంక వెళ్లాలనుకున్న హిడ్మా?

image

AP: వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో దండకారణ్యం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కొద్దిమంది అనుచరులతో కలిసి శ్రీలంకలో తలదాచుకోవాలని భావించాడని సమాచారం. కాకినాడ పోర్టు నుంచి సముద్రమార్గంలో వెళ్లేందుకు ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో దండకారణ్యం నుంచి బయటికొచ్చిన హిడ్మా మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని తెలుస్తోంది.

News November 19, 2025

అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.7వేలు

image

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.5వేలు.. మొత్తంగా రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.

News November 19, 2025

ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

image

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్‌ పరీక్షల్లో బుక్‌లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్‌కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్‌లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్‌గా పరిగణిస్తారు.