News October 17, 2024

మందుబాబులకు షాక్.. పెరగనున్న మద్యం ధరలు?

image

TG: మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ రెండేళ్లకోసారి పెంచుతోంది. ఈసారి వివిధ రకాల బ్రాండ్లపై రూ.20-150 వరకు పెంచాలని బ్రూవరీలు కోరాయి. ఈమేరకు త్వరలోనే ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మద్యం ఆదాయాన్ని ఎక్సైజ్‌ శాఖ అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలూ ధరల పెంపునకు మరో కారణంగా తెలుస్తోంది.

Similar News

News October 17, 2024

అమెజాన్ ప్రైమ్‌లో యాడ్స్.. వచ్చే ఏడాది అమలు

image

ఇండియాలోని యూజర్లకు షాకిచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వచ్చే ఏడాది నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్‌ను జోడించనున్నట్లు ప్రకటించింది. యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం మరింత ధర వెచ్చించి సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి రేట్ల వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, US, UK తదితర దేశాల్లోని యూజర్లకు యాడ్స్‌తో కూడిన కంటెంట్‌ను ప్రైమ్ అందిస్తోంది.

News October 17, 2024

రైల్వే షాకింగ్ న్యూస్: IRCTC షేర్లు ఢమాల్

image

అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ పీరియడ్‌ను 120 నుంచి 60 రోజులకు తగ్గిస్తూ ఇండియన్ రైల్వే తీసుకున్న నిర్ణయం <<14380594>>IRCTC<<>>పై నెగటివ్ ఇంపాక్ట్ చూపించింది. నేడు ఆ షేర్లు 2.3% అంటే రూ.21.70 నష్టపోయి రూ.870 వద్ద క్లోజయ్యాయి. ఈ సంస్థకు 80-85% ఆదాయం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా వస్తుండటమే ఇందుకు కారణం. రైల్వే నిర్ణయంతో రెవెన్యూ తగ్గొచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. లైఫ్‌టైమ్ హై నుంచి IRCTC షేర్లు 25% నష్టపోయాయి.

News October 17, 2024

‘హైడ్రా’పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

image

TG: చెరువుల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలనే హైడ్రా కూలుస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మూసీ పరీవాహకంలో ఎవరి ఇళ్లను హైడ్రా కూల్చలేదన్నారు. కొందరు మెదడులో మూసీ మురికి కంటే ఎక్కువ విషం నింపుకొని దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. తాము ఉన్నపళంగా, నిర్దయగా ఎవరినీ ఖాళీ చేయించడం లేదని, నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించి, రూ.25వేలు ఇచ్చామని వెల్లడించారు.