News September 11, 2024

దొంగలకు షాక్.. ఇద్దరు మృతి

image

TG: దొంగతనానికి వెళ్లిన ఇద్దరు కరెంట్ షాక్‌తో మృతి చెందిన ఘటన MBNR జిల్లా మిడ్జిల్ మండలంలో జరిగింది. బోయిన్‌పల్లిలోని సోలార్ ప్లాంట్‌లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో కంచెకు కరెంట్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి చోరీకి వచ్చిన ఇద్దరు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News January 10, 2026

వొడాఫోన్ ఐడియాకు కేంద్రం భారీ ఊరట

image

అప్పుల భారంతో కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఇటీవల AGR బకాయిల చెల్లింపుల్లో పాక్షిక <<18724413>>మారటోరియం<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026 నుంచి 2032 వరకు ఆరేళ్లపాటు ఏటా రూ.124 కోట్లు, ఆ తర్వాత నాలుగు ఏళ్లపాటు ఏటా రూ.100 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. మొత్తం రూ.87,695 కోట్ల బకాయిల్లో వచ్చే పదేళ్లలో రూ.1,144 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

News January 10, 2026

తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం గంటకు 13 KM వేగంతో శ్రీలంక వైపు కదులుతోంది. ఈరోజు సాయంత్రంలోపు ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.

News January 10, 2026

‘గోవిందా!’ అని అందామా?

image

గోవింద నామమంటే శ్రీవారికి ఎంతో ఇష్టం. ‘గో’ అంటే గోవులే కాదు! వేదాలు, కిరణాలు, సమస్త జీవులని అర్థం. జీవులందరినీ జ్ఞానంతో, ఆహారంతో పోషించేవాడే గోవిందుడు. ఓసారి అగస్త్యుడు ఆవును తీసుకోమని ‘గో ఇంద’ (ఆవును తీసుకో) అని స్వామిని పిలవగా ఆ పిలుపే ‘గోవింద’ నామంగా మారిందని పురాణ గాథ. భక్తితో ఒక్కసారి గోవిందా అని పిలిస్తే, ఆయన ఏడుకొండలు దిగి వచ్చి మనల్ని ఆదుకుంటాడు. గోవింద నామ స్మరణ మోక్షానికి సులభ మార్గం.