News August 19, 2025

ప్రభాస్ మూవీలను దాటేసిన చిన్న సినిమా

image

యానిమేషన్ వండర్ ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. హిందీలో ఈ మూవీ సాహో(రూ.150 కోట్లు), సలార్(రూ.153 కోట్లు) లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసింది. 25 రోజుల్లో రూ.160 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్లు దాటొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లకు చేరువైంది.

Similar News

News August 19, 2025

సుదర్శన్ రెడ్డి ఎంపికకు కారణమిదేనా?

image

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా <<17451888>>బి.సుదర్శన్‌రెడ్డి<<>> ఎంపిక వ్యూహాత్మక నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపడంతో NDAతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లైందంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని TDP, YSRCP, BRS పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకే తెలుగు వ్యక్తిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. సుదర్శన్‌రెడ్డి CM చంద్రబాబుకు సన్నిహితుడు కావడం గమనార్హం.

News August 19, 2025

కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్

image

TG: హైదరాబాద్‌లో విద్యుత్ స్తంభాలపై పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో TGSPDCL సిబ్బంది యుద్ధప్రాతిపదికన వాటిని కట్ చేస్తున్నారు. <<13977633>>ఏడాది సమయం<<>> ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని హెచ్చరించారు.

News August 19, 2025

క్రేజీ.. కమల్ హాసన్-రజినీ కాంబోలో మూవీ!

image

తమిళ బిగ్ స్టార్లు రజినీ కాంత్, కమల్ హాసన్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తారని తెలుస్తోంది. క్రేజీ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తర్వాతి ప్రాజెక్ట్ ఇదేనని సినీ వర్గాలు తెలిపాయి. ఇదే నిజమైతే థియేటర్లు దద్దరిల్లుతాయని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే కమల్, రజినీతో విక్రమ్, కూలీ సినిమాలను లోకేశ్ తెరకెక్కించారు. ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు ‘ఖైదీ-2’ ఆలస్యం కానుందని సమాచారం.