News February 23, 2025

స్కూళ్లకు ఒకే యాప్.. కీలక నిర్ణయం

image

AP: విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్ తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో స్కూల్, టీచర్, స్టూడెంట్ అనే 3 ఆప్షన్లు ఉంటాయి. విద్యార్థుల సామర్థ్యాలు, మార్కులు, ఆరోగ్య సమాచారాలను పేరెంట్స్ సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే పాఠశాలల్లో సౌకర్యాల సమాచారమూ ఉంటుంది. ఉపాధ్యాయుల రోజువారీ కార్యకలాపాలు, సెలవులు, బదిలీల వివరాలను పొందుపరుస్తారు. త్వరలోనే యాప్ అందుబాటులోకి వస్తుంది.

Similar News

News February 23, 2025

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త

image

TG: మార్చి 1న కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26న 16వేల కుటుంబాలకు కార్డులు ఇవ్వగా, మార్చి 1న ఎన్నికల కోడ్ లేని HYD, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనుంది. MAR 8 తర్వాత మిగతా జిల్లాల్లో జారీ చేయనున్నారు. ఏళ్లుగా రేషన్ కార్డుల పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3సార్లు దరఖాస్తులు చేయగా, అధికారులు కులగణన సర్వే ప్రామాణికంగా పరిశీలిస్తున్నారు.

News February 23, 2025

టన్నెల్‌లో బయటపడ్డ కార్మికుడి చెయ్యి

image

TG: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారి ఆచూకీని సహాయక బృందాలు కనుగొన్నాయి. టన్నెల్‌లో 14వ కి.మీ వద్ద మట్టి దిబ్బల్లో ఓ కార్మికుడి చేయి బయటపడింది. దీంతో లోపల చిక్కుకుపోయిన 8 మందిలో ఎంత మంది ప్రాణాలతో ఉన్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా బురదలో కూరుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రెస్క్యూను ముమ్మరం చేశాయి.

News February 23, 2025

రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

image

TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఆదిలాబాద్ రాం లీలా మైదానంలో వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

error: Content is protected !!