News June 12, 2024

త్వరలో భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం?

image

TG: భూ సమస్యల పరిష్కారానికి కామన్ రెవెన్యూ కోడ్ తేవాలని ధరణి కమిటీ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే చట్టంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అలాగే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో రైతుల భూములకు హద్దులు నిర్ణయించాలని, పక్కా విస్తీర్ణంతో పాస్‌బుక్‌లు జారీ చేయాలంటోంది. వీటితో పాటు గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది.

Similar News

News January 16, 2026

పట్టుచీర కట్టిన తర్వాత..

image

* చీరలపై ఏవైనా మరకలు పడితే, ఆ ప్రాంతం వరకే శుభ్రం చేస్తే సరిపోతుంది. * చీరలను కట్టిన వెంటనే కాకుండా నాలుగైదు సార్లు కట్టిన తర్వాత డ్రై క్లీనింగ్‌కి ఇస్తే సరిపోతుంది. * కొత్త చీరలను డిటర్జెంట్ పౌడర్, షాంపూలతో వాష్ చేస్తారు. అలాంటప్పుడు గాఢత తక్కువ ఉన్నవాటిని ఎంచుకోవాలి. * ఎంబ్రాయిడరీ, ఇతర వర్కులు ఉన్న హెవీ చీరలను చేత్తోనే ఉతకడం మంచిది. * రెండు, మూడు చీరలు ఉతకాల్సి వచ్చినపుడు వేటికవే విడిగా ఉతకాలి.

News January 16, 2026

కనకాంబరంలో పిండి నల్లి నివారణకు సూచనలు

image

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

News January 16, 2026

మీరు పాలించడానికి అర్హులేనా?: జగన్

image

AP: గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో YSRCP కార్యకర్త మందా సాల్మన్‌ హత్యకు TDP వర్గీయులే కారణమని మాజీ CM జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ‘రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు? మీరు పాలించడానికి అర్హులేనా?’ అంటూ CM చంద్రబాబును ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపడం దుర్మార్గమని మండిపడ్డారు.