News August 21, 2024
ఒక్క కత్తెర 36 విమానాలను రద్దు చేయించింది
జపాన్లోని హక్కైడో విమానాశ్రయంలో కత్తెర పోవడంతో 36 విమానాలు రద్దు, 201 విమానాలు ఆలస్యమయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బోర్డింగ్ గేట్ సమీపంలో ఉన్న ఓ దుకాణంలో కత్తెర మాయమైంది. దీంతో భద్రత దృష్ట్యా సిబ్బంది రోజంతా కత్తెర కోసం వెతికారు. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులతో చెకింగ్ పాయింట్ల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి. అయితే ఆ కత్తెర అదే దుకాణంలో దొరకడం కొసమెరుపు.
Similar News
News January 21, 2025
రేప్ కేసుపై సీఎం స్పందించే తీరు ఇదేనా..
బెంగళూరు రేప్ కేసుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందన విమర్శలకు దారితీసింది. ఆ దారుణాన్ని ఖండించాల్సింది పోయి BJP హయాంలో అత్యాచారాలు జరగలేదా అని ప్రశ్నించారు. ‘BJP ప్రభుత్వ పాలనలోనూ అత్యాచారాలు జరిగాయి కదా. మహిళలు జాగ్రత్తగా ఉండాలి. వారిని కాపాడాలి. కానీ బయట కొందరు సంఘ విద్రోహులు ఉన్నారు. వారివల్లే ఇదంతా’ అని అన్నారు. ఒంటరి యువతిని ఇంటి వద్ద దించుతామని ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
News January 21, 2025
అమితాబ్ అపార్ట్మెంట్కు రూ.83కోట్లు!
అమితాబ్ బచ్చన్ ముంబై ఓషివారాలోని తన డూప్లెక్స్ అపార్ట్మెంట్ను ₹83కోట్లకు అమ్మేశారు. ఆయనకు 168% ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. 2021 ఏప్రిల్లో ఆయన దీనిని ₹31కోట్లకు కొన్నారు. నవంబర్లో హీరోయిన్ కృతి సనన్కు నెలకు ₹10లక్షలకు రెంట్కు ఇచ్చారు. ఈ అపార్ట్మెంట్ విస్తీర్ణం 5,185 sq ft ఉంటుందని సమాచారం. కాగా బిగ్ బి ఫ్యామిలీ గత ఏడాది రియల్ ఎస్టేట్లో ₹100cr ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
News January 21, 2025
బ్యాంక్ ఖాతాదారులకు ALERT
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. KYC వివరాలను అప్డేట్ చేయని కస్టమర్లు జనవరి 23 నుంచి తమ ఖాతాలను ఉపయోగించలేరు. ఇందుకోసం ఓటర్, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, విద్యుత్ బిల్లు వంటి వాటిల్లో ఏదో ఒక పత్రం సమర్పించి KYC చేయించాలి. వీటి వివరాలను పరిశీలించి బ్యాంక్ ఖాతాదారుల వివరాలను అప్డేట్ చేస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదంటే నేరుగా బ్రాంచ్లో అయినా ఇది చేయవచ్చు.