News January 9, 2025
మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సీనియర్ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాగా జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Similar News
News January 9, 2025
అందుకే బీర్ల తయారీని నిలిపేస్తున్నాం: UBL
TG: రాష్ట్రంలో బీర్ల తయారీని నిలిపేయడానికి గల కారణాలపై యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ మరోసారి వివరణ ఇచ్చింది. ‘బీరు తయారీ ముడిసరకు ధరలు పెరిగాయి. బీరు ధరలో తయారీ రేటు 16 శాతం కాగా ప్రభుత్వ పన్నులు 70 శాతం ఉంటాయి. మాకు సర్కారు నుంచి సకాలంలో <<15107893>>చెల్లింపులు<<>> జరగట్లేదు. నష్టాలు భరించలేక బీర్ల సరఫరా ఆపేస్తున్నాం’ అని పేర్కొంది.
News January 9, 2025
వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల
AP: పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రేపటి నుంచి మొదలుకానున్న నేపథ్యంలో భూలోక వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్కాంతుల ధగధగల మధ్య శ్రీవారి క్షేత్రం మెరిసిపోతోంది. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తజన గోవింద నామ స్మరణతో ఏడుకొండలు మారుమోగుతున్నాయి. రేపు వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమన్నారాయణుడి వైకుంఠ ద్వార దర్శనం ముక్తిని ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.
News January 9, 2025
రేపు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్.. వారికి పోలీసుల సూచనలు
TG: ‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో HYDలో ‘గేమ్ ఛేంజర్’ ప్రదర్శించే థియేటర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ చేశారు. రేపు ఆ సినిమా విడుదల సందర్భంగా నిబంధనలు పాటించాలని యజమానులను సూచించారు. థియేటర్ల వద్ద హడావుడి ఉండొద్దని, టికెట్ ఉన్న ప్రేక్షకులనే లోపలికి అనుమతించాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.