News January 3, 2025

జీవాంజి దీప్తికి చిరు సత్కారం

image

పారా ఒలింపిక్ విజేత, తెలుగమ్మాయి జీవాంజి దీప్తిని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఆమెకు శాలువా కప్పి, రూ.3 లక్షల నగదు పురస్కారం అందించారు. అనంతరం అక్కడ శిక్షణ తీసుకుంటున్న చిన్నారులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. కాగా దీప్తి ఒలింపిక్ మెడల్ సాధించినప్పుడు చిరంజీవిని కలవడం తన కల అని చెప్పినట్లు పుల్లెల గోపీచంద్ తెలిపారు.

Similar News

News January 5, 2025

నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు: హీరోయిన్

image

తనను ఓ బిజినెస్‌మెన్ వెంబడిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మలయాళ హీరోయిన్ హనీ రోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘గతంలో ఓ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్‌కు నేను హాజరయ్యా. అప్పటినుంచి అతడు వెంటపడుతూ, సోషల్ మీడియాలోనూ నా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు’ అని ఆమె పేర్కొన్నారు. అతడిపై చట్టపరంగా పోరాడుతా అని తెలిపారు.

News January 5, 2025

తెలుగు వాళ్లు దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నారు: సీఎం

image

TG: నేడు జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందని CM రేవంత్ అన్నారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు అని, మన సినీ పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని చెప్పారు. ఇంత ప్రభావం ఉన్నా మనం దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. NTR, PV, వెంకయ్య జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని తెలిపారు. HYDలో జరుగుతున్న తెలుగు సమాఖ్య మహాసభల్లో సీఎం మాట్లాడారు.

News January 5, 2025

సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా: భట్టి

image

TG: సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా ఇస్తామని Dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈనెల 26 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. వరంగల్(D) మొగిలిచర్ల సభలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిందని, పదేళ్లపాటు గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేదని విమర్శించారు. రూ.2లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేశామని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.