News July 11, 2024
పీరియడ్స్ ఎప్పుడొస్తుందో చెప్పే స్మార్ట్ రింగ్!

టెక్ దిగ్గజం శామ్సంగ్ స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. Samsung Galaxy Ring పేరుతో రిలీజైన ఇది మానవ జీవన శైలిని క్యాప్చర్ చేస్తుంది. Samsung Health యాప్‌లోని AI.. వ్యక్తికి సంబంధించిన పీరియడ్స్ టైమింగ్, స్లీప్ ట్రాకింగ్, హృదయ స్పందన రేటు, స్కిన్ టెంపరేచర్ వంటివి తెలియజేస్తుంది. దీని ధర $399 (రూ.33వేలు)గా శామ్సంగ్ నిర్ణయించింది. తాజాగా ప్రీఆర్డర్ మొదలవగా ఈనెల చివరి వారంలో డెలివరీ చేయనుంది.
Similar News
News January 20, 2026
జోగి సోదరులకు బెయిల్

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరైంది. భవానీపురంలో నమోదైన కేసులో బెయిల్ లభించగా, మొలకలచెరువు కేసులో ఆయన రిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
News January 20, 2026
4 గంటలుగా కొనసాగుతున్న హరీశ్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పీఎస్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలకుపైగా సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్మెంట్ ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి హరీశ్ కూడా దీటుగా సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. అటు మాజీ మంత్రి విచారణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.
News January 20, 2026
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

పశ్చిమ గోదావరి జిల్లా కోర్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు JAN 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అర్హత సాధించి ఉండాలి. వయసు 18 – 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. westgodavari.dcourts.gov.in


