News September 1, 2025
చెప్పులో దూరిన పాము.. చూడకుండా ధరించడంతో!

వర్షాల వల్ల సర్పాలు, కీటకాలు ఇళ్ల బయట ఉంచిన చెప్పులు, హెల్మెట్స్‌లో తలదాచుకుంటుంటాయి. అలా బెంగళూరులో మంజు ప్రకాశ్ అనే యువకుడు ఇంటి బయట ఉంచిన చెప్పులను పరిశీలించకుండా ధరించాడు. దీంతో అందులో ఉన్న పాము కాటేసింది. గతంలో ఓ ప్రమాదం వల్ల ప్రకాశ్ తన కాలులో స్పర్శ కోల్పోవడంతో కాటేసినట్లు తెలియలేదు. అరగంట పాటు ఆ చెప్పులతోనే నడిచి ఇంటికెళ్లిన కొద్దిసేపటికే చనిపోయాడు. పాము కూడా మరణించింది.
Similar News
News September 1, 2025
CBI విచారణపై సస్పెన్స్!

తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న ‘కాళేశ్వరం ప్రాజెక్టు CBI విచారణ’ అంశంపై కేంద్ర నిర్ణయం ఆసక్తికరంగా మారింది. PC ఘోష్ కమిషన్ రిపోర్టులో BJP MP, BRS ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పేరూ ఉంది. దీంతో సొంత నేతపై ఆరోపణలున్న కేసు దర్యాప్తుకు అప్పగిస్తే సెల్ఫ్ గోల్ అవుతుందా? వెయిట్ చేస్తే కాంగ్రెస్ విమర్శలతో ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? తదితర అంశాలు లెక్కలేసుకున్నాకే నిర్ణయం తీసుకోనుంది.
News September 1, 2025
ఈ నెల 6న యూరియా కొరతపై వైసీపీ ఆందోళనలు

AP: రాష్ట్రంలో యూరియా కొరతపై ఈ నెల 6న ఆందోళనలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ నిరసనలు చేపట్టనున్నారు. కాగా టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ చేసి పక్కదారి పట్టిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
News September 1, 2025
ఇందిరమ్మ చీరలు ఈసారైనా చేరేనా..?

తెలంగాణలో ఈసారి కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ అనుమానమే. గతేడాది శారీలు ఇవ్వని సర్కారు ఈసారి మరింత క్వాలిటీతో మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు అందిస్తామని ఇటీవలే చెప్పింది. సెప్టెంబర్ 21 – 30 మధ్య బతుకమ్మ వేడుకలు జరగనుండగా, సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. దీంతో ఇందుకు రెండు వారాల ముందే నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చు. ఈ పరిణామాలను బట్టి ఈసారీ ఆడబిడ్డలకు చీరలు అందకపోవచ్చు.