News July 29, 2024
స్కామర్‌ను బోల్తా కొట్టించిన సాఫ్ట్వేర్ డెవలపర్

PAN లింక్ చేయకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని సైబర్ నేరగాళ్లు హరియాణా, గుర్గావ్కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ శరణ్‌కు మెసేజ్ పంపారు. లింక్ ఓపెన్ చేసి చూడగా అది ఫేక్ అని, ఇది ఫేక్ వెబ్సైట్ అని అచ్చం HDFCని పోలిన వెబ్సైట్లా మారుస్తానని అతను స్కామర్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. దీనికి రూ.20 వేలు ఖర్చు అవుతుందని స్కామర్‌నే బోల్తా కొట్టించాడు. వీరి మధ్య జరిగిన చాట్ ఫొటోలు వైరలవుతున్నాయి.
Similar News
News October 31, 2025
Pro Kabaddi: నేడే ఫైనల్ పోరు

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12 ఫైనల్ పోరులో ఇవాళ దబాంగ్ ఢిల్లీ K.C. జట్టు పుణేరి పల్టాన్‌తో తలపడనుంది. ఢిల్లీలో రా.8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఈ 2 జట్ల మధ్య తుది సమరం జరగనుండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 2021-22 సీజన్లో ఢిల్లీ టైటిల్ సాధించగా 2023-24లో పుణేరి కప్పు కొట్టింది. దీంతో ఈ 2 టీమ్‌ల్లో ఎవరు నెగ్గినా రెండోసారి టైటిల్‌ను ముద్దాడనున్నాయి.
News October 31, 2025
బ్రూసెల్లోసిస్ వ్యాధి.. నివారణ, జాగ్రత్తలు

ఈ వ్యాధి నివారణకు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి. 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు బ్రూసెల్లా వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. పశువు ఈడ్చుకు పోయినప్పుడు దాని పిండాన్ని, మాయను, గర్భాశయ ద్రవాలు, ఇతర చెత్తను దూరంగా తీసుకెళ్లి కాల్చేయాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరంగా ఉంచాలి. పశువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. చికిత్స చేసేటప్పుడు వెటర్నరీ డాక్టర్లు తగిన వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకోవాలి.
News October 31, 2025
‘బాహుబలి-ది ఎపిక్’ పబ్లిక్ టాక్

బాహుబలి సినిమా రెండు పార్టులను కలిపి మేకర్స్ ‘బాహుబలి-ది ఎపిక్’గా రిలీజ్ చేశారు. పాతదే అయినా కొత్త మూవీ చూసినట్లు అనిపిస్తోందని ప్రీమియర్లు చూసిన వారు చెబుతున్నారు. ఎడిటింగ్, మ్యూజిక్, విజువల్స్ అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయంటున్నారు. అయితే కొన్ని నచ్చిన సీన్లతో పాటు పాటలు లేకపోవడం నిరాశకు గురిచేసిందని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో WAY2NEWS రివ్యూ.


