News September 21, 2024
ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!

పుణేలో ఓ CA ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న ఘటన మరువక ముందే చెన్నైలో కార్తికేయన్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్(38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెనీ ప్రాంతానికి చెందిన ఆయన కుటుంబంతో సహా చెన్నైలో ఉంటున్నారు. వృత్తిపరమైన ఒత్తిడి, డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా కుటుంబీకులెవరూ ఇంట్లోలేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 28, 2025
గజ్వేల్‌లో దారుణం.. అమానుష ఘటన

గజ్వేల్ పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగో బిడ్డను సాకలేనని ఓ తల్లి అబార్షన్ మాత్రలు మింగి గర్భస్రావం చేసుకుంది. గర్భస్రావం అనంతరం ఆరు నెలల నెత్తుటి గుడ్డును గజ్వేల్‌లోని రాజిరెడ్డిపల్లి పార్శి కుంట వద్ద పడేశారు. దీంతో స్థానికులు గమనించి నిలదీయడంతో నిజం ఒప్పుకున్నారు. వెంటనే గజ్వేల్ పోలీసులు తల్లి, ఆమెకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన ఆర్ఎంపీని అరెస్ట్ చేశారు.
News November 28, 2025
మహిళల్లో ఊబకాయంతో పక్షవాతం ముప్పు

టీనేజ్ నుంచి అధికబరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు అమెరిన్ స్ట్రోక్ అసోసియేషన్ పరిశోధనలో వెల్లడైంది. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. దీంతోపాటు షుగర్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.
News November 28, 2025
గ్రీన్‌కార్డ్ ఇంటర్వ్యూకు వెళ్తే అరెస్ట్ చేస్తున్న పోలీసులు

గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలకు వెళ్లిన విదేశీ పౌరులను అరెస్టు చేస్తున్నారు. శాన్ డియాగోలో వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన తన క్లయింట్స్ ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఓ లాయర్ చెప్పారు. అరెస్టైన వారంతా US సిటిజన్ల జీవితభాగస్వాములని, వీసా గడువు ముగిసినా ఎటువంటి క్రిమినల్ కేసులు వారిపై లేవన్నారు. ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో వీసా గడువు ముగిసిన వారిని అరెస్ట్ చేస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ నస్సేరీ తెలిపారు.


