News February 8, 2025
అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన ఓ కొడుకు పగ!

కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా న్యూఢిల్లీ సీట్లో అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ఓ కొడుకు పగ తోడైంది. 1998, 2003, 2008లో ఇక్కడ Ex CM షీలా దీక్షిత్ హ్యాట్రిక్ కొట్టారు. 2013లో ఆమెను ఓడించి AK CM అయ్యారు. ఇక్కడ 3 సార్లు గెలిచిన ఆయన ఈసారి 4089 ఓట్లతో ఓడారు. షీలా కొడుకు సందీప్ దీక్షిత్ (INC)కు ఇక్కడ వచ్చిన ఓట్లు 4568. వీటిని చీల్చకపోతే AKదే విజయం. ఇలా తన తల్లి ఓటమికి ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు.
Similar News
News March 18, 2026
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్‌లు ఇలా తీసుకోండి!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ‘దివ్యాంగ శక్తి’ పథకానికి అమరావతిలో CM CBN శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గాల్లో MLAలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్‌పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్‌లు తీసుకోవచ్చు. APSRTC యాప్, మనమిత్ర యాప్ ద్వారా కూడా డిజిటల్ పాస్ పొందొచ్చు. ఈ స్కీమ్‌తో రాష్ట్రంలో 11.16 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలగనుంది.
News March 18, 2026
జూన్‌లో గ్రూప్స్ నోటిఫికేషన్?

AP: గ్రూప్-1,2 పోస్టుల భర్తీకి APPSC సిద్ధమవుతోంది. జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన డేటా ప్రకారం గ్రూప్-1లో 101 పోస్టులు, గ్రూప్-2లో 470 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆగస్టులో, గ్రూప్-2కు సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
News March 18, 2026
ప్రతీకారం తీర్చుకోవాల్సిందే: మొజ్తబా

అమెరికాతో సీజ్‌ఫైర్ ప్రతిపాదనను ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తిరస్కరించారు. US, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన చెప్పినట్లు ఇరాన్ అధికారి ద్వారా తెలిసిందని రాయిటర్స్ వెల్లడించింది. ‘శాంతికి ఇది సమయం కాదు. US, ఇజ్రాయెల్ మోకరిల్లి, ఓటమిని అంగీకరించి, నష్టపరిహారం చెల్లించాలి’ అని మొజ్తబా స్పష్టంచేశారని పేర్కొంది. USతో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని 2 దేశాలు ఇరాన్‌కు ప్రతిపాదనలు పంపాయంది.


